ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు ఎన్ని అంటే..!
By సుభాష్ Published on 12 July 2020 2:18 PM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మయదారి మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 213 దేశాలకు ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాపించింది. ఇక ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 12,874,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568,325 మంది మరణించారు. ఇక 7,503,118 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, గడిచిన 24 గంటల్లోనే 4996 మంది మృతి చెందారు.
అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరం
కాగా, అమెరికా, బ్రెజిల్, రష్యాల దేశాల్లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన అన్ని దేశాలు.. ప్రస్తుతం దశల వారీగా సడలింపులు ఇస్తోంది. సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో పాజిటివ్ కేసులు తవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 3,357,130 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 137,418 మరణాలు సంభవించాయి. బ్రెజిల్‌లో 1,840,812 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 71,492 మంది మృతి చెందారు. ఇక రష్యాలో ఇప్పటి వరకూ 727,162 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,335 మంది మృతి చెందారు. అలాగే భారత్‌లో 854,480 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22,718 మంది మృతి చెందారు.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల, మరణాలు అంతకంతకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. లాక్‌డౌన్ సమయంలో కొన్ని దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా.. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మళ్లీ విజృంభిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఇప్పట్లే తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరో వైపు కరోనా వ్యాక్సిన్ తయారీకి భారత్ తోపాటు చాలా దేశాలు కూడా పరిశోధనలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండటంతో మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.