ఏప్రిల్‌ 21న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలే నేడు నిజమవుతున్నాయి..!

By సుభాష్  Published on  11 July 2020 4:02 AM GMT
ఏప్రిల్‌ 21న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలే నేడు నిజమవుతున్నాయి..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కాలరాస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య తీవ్రతరం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం ఉందని, మున్ముందు విశ్వరూపం దాల్చే అవకాశాలున్నాయని అన్ని దేశాలు కలిసికట్టుగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటే మంచిదని,లేకపోతే తీవ్ర ప్రమాదంలోపడే అవకాశం ఉందని ఏప్రిల్‌ 21వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) హెచ్చరించింది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా లెక్కలు చూస్తే దిమ్మదిరిగేలా ఉన్నాయి.

ఏప్రిల్‌ 21 నాటికి ప్రపంచంలో దాదాపు 25 లక్షల మంది కరోనా బారిన పడగా,1.66 మంది మరణించారు. ప్రస్తుతం ఆ లెక్కలు దూసుకుపోయాయి. ప్రస్తుతం 12,166,688 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 552,046 మంది మరణించారు. ఇందులో ఇప్పటి వరకూ కోలుకున్న వారు 7,030,227 మంది ఉన్నారు. ఇక భారత్‌లో శుక్రవారం ఒక్క రోజే 26,506 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 475 మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటి వరకూ మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య7,93,802కు చేరింది. ఈ మహమ్మారి బారిన ఇప్పటి వరకూ 21,604 మంది మరణించారు. ముందుగానే హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి.

ఏప్రిల్‌ 21న కరోనా ప్రభావం స్వల్పమే అయినా.. మన్ముందు దీని ప్రభావం మరింతంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టీడ్రాస్‌ అడ్హనామ్‌ జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో వ్యాఖ్యనించారు. మున్ముందు దేశాల్లో విశ్వరూపం చూపెట్టడం ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను శాశ్వతంగా అమలు చేసే వీలులేదని, ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మార్గమని అప్పట్లో ఆయన అభిప్రాయపడ్డారు. మాస్క్‌ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడమే ఉత్తమమన్నారు. అలాగే 1918లో వచ్చిన స్పానిష్‌ ప్లూకు ఎన్నో సారూప్యాలున్నాయని, స్పానిష్‌ ప్లూ తరహాలోనే కరోనా సైతం నిదానంగా విజృంభించి ప్రాణాలు తీస్తోందని హెచ్చరించారు.

ఇప్పటి వరకు ఏ దేశంలో ఎన్ని కేసులు

చైనాలో 83,581 కేసులు నమోదు కాగా, 78,590 మంది మృతి చెందారు.
యూఎస్‌ఏలో 3,158,932 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 134,862 మంది మృతి చెందారు.
యూకేలో 286,979 పాజిటివ్‌ కేసులు కాగా, 44,517 మంది మృతి చెందారు.
సింగపూర్‌లో 45,298 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 26 మంది మృతి చెందారు.
జపాన్‌లో 20,174 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 980 మంది మృతి చెందారు.
భారత్‌ లో 7,93,802 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 21,604 మంది మృతి చెందారు.
తైలాండ్‌లో 3,197 కేసులు నమోదు కాగా, 58 మంది మృతి చెందారు.
సౌత్‌ కోరియాలో 13,298 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 287 మంది మృతి చెందారు.
మలేషియాలో 8,677 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 121 మంది మృతి చెందారు.
తైవాన్‌లో 449 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు.
ఇటలీలో 242,149 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 34,914 మంది మృతి చెందారు.
ఇరాన్‌లో 248,379 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12,084 మంది మృతి చెందారు.
ఫ్రాన్స్‌ లో 169,473 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 29,965 మంది మృతి చెందారు.
హంకాంగ్‌లో 1,324 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు.

Next Story