శృంగారంలో పాల్గొన‌క‌పోవ‌డ‌మే మ‌హిళ‌ల్లో మోనోపాజ్ స‌మస్యకు కార‌ణమ‌న‌ట‌..!

By అంజి  Published on  21 Jan 2020 5:53 AM GMT
శృంగారంలో పాల్గొన‌క‌పోవ‌డ‌మే మ‌హిళ‌ల్లో మోనోపాజ్ స‌మస్యకు కార‌ణమ‌న‌ట‌..!

ఎక్కువ లైంగిక సంబంధం కలిగి ఉన్న మహిళలకు మెనోపాజ్ వచ్చే అవకాశం తక్కువ. వారానికి ఒకసారి లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలోని రుతువిరతి సంభావ్యత నెలకు ఒకసారి సంభోగం చేసే మహిళల కంటే 28 శాతం తక్కువ. ఈ విష‌యం యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధనలో తేలింది. లైంగిక సంపర్కం యొక్క శారీరక సంకేతాలు గ‌ర్భందాల్చే అవకాశాలు ఉన్నాయా..? లేవా..? అన్న అంశాల‌ను సూచిస్తుంద‌ని పరిశోధకులు తెలిపారు.

మరీ ముఖ్యంగా 35, అంతకంటే ఎక్కువ వ‌య‌స్సు క‌లిగిన మ‌హిళ‌ల్లో నెల‌కు ఒక‌సారి సంభోగం చేయ‌ని యొడ‌ల‌ రుతువిరతి స‌మ‌స్య ప‌దే ప‌దే ఉత్ప‌న్న‌మ‌వుతుంద‌ని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధన అధ్యయనం చెబుతోంది.

ఈ విష‌య‌మై, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెస‌ర్ మేగాన్ ఆర్నోట్ మాట్లాడుతూ, "స్త్రీ శృంగారం చేయకపోతే గర్భధారణకు అవకాశం ఉండ‌ద‌ని, దాని కార‌ణంగా శరీరం అండోత్సర్గము ఆగిపోతుందన్నారు. అండోత్సర్గము ఆగిపోయే స‌మ‌యంలో స్త్రీ యొక్క రోగనిరోధక శక్తి మ‌రింత‌ క్షీణిస్తుంద‌ని, అది శరీరం వ్యాధి బారిన పడేలా చేస్తుందన్నారు.

1996/1997 లో SWAN అధ్యయనం కింద 2,936 మంది మహిళల నుండి సేకరించిన డేటా ఆధారంగా ఈ పరిశోధన జరిగింద‌ని ప్రొఫెస‌ర్ మేగాన్ ఆర్నోట్ తెలిపారు. ప‌రిశోధ‌న స‌మ‌యంలో గ‌త ఆరు నెల‌లుగా మహిళలు తమ భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉన్నారా..? అన్న ప్ర‌శ్న‌తోపాటు మ‌రికొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని అడిగిన‌ట్టు చెప్పారు.

కేవ‌లం లైంగిక సంబంధం గురించే కాకుండా, గత ఆరు నెలల్లో లైంగిక ప్రేరేపణకు సంబంధించిన ఇతర ప్రశ్నలను కూడా ప‌రిశోధ‌న‌లో భాగంగా అడిగారు, ఇందులో ఓరల్ సెక్స్, లైంగిక స్పర్శ మరియు స్వీయ - ప్రేరణ లేదా హస్త ప్రయోగం గురించి సవివరమైన సమాచారం కూడా తీసుకున్నారు.

దీంతో 74 శాతం మంది మ‌హిళ‌లు ఇచ్చిన స‌మాధానాల‌నుబ‌ట్టి క‌నీసం నెల‌కు ఒక‌సారైన లైంగిక కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌ని మ‌హిళ‌లు మోనోపాజ్ స‌మ‌స్య‌కు గురైన‌ట్టు తేలింద‌ని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెస‌ర్ మేగాన్ ఆర్నోట్ తెలిపారు. తమ ప‌రిశోధ‌న‌లో పాల్గొన్న‌ 2,936 మంది మహిళల్లో 65 శాతం మంది మ‌హిళ‌లు మెనోపాజ్ స‌మ‌స్య‌ను అనుభవించార‌ని ఆయ‌న చెప్పారు.

మ‌హిళ‌ల్లో రుతుచ‌క్రం ఆగిపోవ‌డానికి కూడా మోనోపాజ్ స‌మ‌స్యే కార‌ణ‌మ‌ని, రుతుచ‌క్రం ఆగ‌డ‌మ‌న్న‌ది సంతానోత్స‌త్తి ముగింపుగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధన పూర్తి వివ‌రాల‌ను రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ పత్రికలో ప్రచురించబడింది.

Next Story