'ఫ్రిజ్‌'లో మహిళా మృతదేహం

By Newsmeter.Network  Published on  3 Jan 2020 10:08 AM GMT
ఫ్రిజ్‌లో మహిళా మృతదేహం

మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందికి ఆ ఇంట్లోని ఫ్రిజ్ లో మహిళా మృతదేహం లభ్యం కావడం అందరిని షాక్ కు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే కొత్త సంవత్సరం తొలిరోజు సాయంత్రం ఫ్రాన్స్‌లోని ఒక ఇంటికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన ఫైర్ సిబ్బందికి ఫ్రిజ్ లో ముక్కలు ముక్కలుగా నరికిన 83 ఏళ్ల మహిళా మృతదేహం కనిపించింది.

దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆ ఇంట్లో నివసించే మృతురాలి మనవడిని విచారించారు. అతను పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాదానాలు చెప్పడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story