కరోనా పేషెంట్ కేఫ్‌కు వెళ్లింది.. 27 మందికి అంటించింది
By సుభాష్ Published on 25 Aug 2020 10:26 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తోంది. కరోనా సోకిన ఓ మహిళ కేఫ్‌కు వెళ్లడంతో 27 మందికి వ్యాపించిందంటే వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఇట్టే అర్థమైపోతోంది. ఈ ఘటన దక్షిణ కోరియాలో చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ ఇంట్లో కూర్చుండక స్టార్‌బక్స్ కేఫ్‌కు వెళ్లింది. అంతే.. ఆమెతోపాటు అక్కడికి వచ్చిన వారందరికి కరోనా పాజిటివ్ తేలింది. అక్కడున్నవారిలో 27 మందికి కరోనా సోకగా, నలుగురికి మాత్రమే సోకలేదు. ఎందుకంటే అందరిలో నలుగురికి మాత్రమే మాస్క్ ధరించడం వల్ల వైరస్ వారికి సోకలేకపోయింది. 27 మంది ఎలాంటి మాస్క్‌లు ధరించకపోవడంతో వారు కరోనా బారినపడ్డారు.
ఈ ఘటన ఆగస్టు 8వ తేదీన జరిగింది. దీన్ని బట్టి కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందనేది తెలిసిపోతుంది. ఇదే సమయంలో కరోనా బారిన పడకుండా ఎలా ఉండాలో కూడా తెలిసిపోతుంది. ఆ రోజు నలుగురికి ఫేస్ మాస్క్‌లు ఉండటంతో 27 మందికి సోకిన కరోనా.. ఆ నలుగురికి చేరలేకపోయింది. అందుకే మొదటి నుంచి నిపుణులు, వైద్యులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్క్లు పెట్టుకోవాలని హెచ్చిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా బయటకు వచ్చేది లేదని ప్రధాని జాసిండా అర్డెర్న్ సోమవారం వెల్లడించారు.
అయితే కరోనా వచ్చిన ఆ పేషెంట్ ఆగస్టు 8న స్టార్ బక్స్ కేఫ్‌కు వచ్చి వెళ్తే.. ఆగస్టు 24 నాటికి ఈ వైరస్ అదే ప్రాంతంలో దాదాపు 40 మందికి సోకినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ వారం మరో మూడు వేల మంది వరకు కరోనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించాలని దక్షిణ కొరియా ప్రభుత్వం సూచిస్తోంది. మాస్క్‌లు ధరించకుండా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు దక్షిణ కొరియా ప్రభుత్వం.