ఉత్తరప్రదేశ్‌లో మరో నిర్భయ..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2020 4:18 AM GMT
ఉత్తరప్రదేశ్‌లో మరో నిర్భయ..!

మహిళల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోట నిర్భయ లాంటి ఘటనలు జరుగుతున్నాయి. తొమ్మిది సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన లాగే.. తాజాగా యూపీలో జరిగింది. కదులుతున్న బస్సులో మహిళ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. యూపీలోని ప్రతాప్‌ గడ్‌ నుంచి నోయిడాకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో 25 ఏళ్ల మహిళ ఎక్కింది. ఆమె బస్సు ఎక్కిన సమయంలో బస్సు డ్రైవర్లు ఆమెకు వెనుక సీటు కేటాయించారు. ఆ ఇద్దరు ఆమెపై కన్నేశారు. బుధవారం వేకువజామున లక్నో, మధుర జాతీయ రహదారిపై ఆమెపై ఇద్దరు డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నోయిడాలో దిగిన ఆ మహిళ తన భర్తకు జరిగిన విషయం చెప్పింది. ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో పన్నెండు మంది వరకు ఉన్నారని, బస్సు చివరి సీటులో తన ఇద్దరు పిల్లలతో కూర్చున్న బాధితురాలిని నిందితులు బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Next Story
Share it