కృష్ణానదిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గురువారం విజయవాడలో చోటు చేసుకుంది. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు ఆమెను కాపాడారు.

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది. అనంతరం.. తన కుమారుడిని అక్కడే వదిలేసి.. బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకేసింది. గమనించిన పోలీసులు.. వెంటనే గజఈతగాళ్ల సాయంతో మహిళను రక్షించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Newsmeter.Network

Next Story