మహాతల్లివమ్మా..చాలా పెద్ద మనసు నీది

By రాణి  Published on  15 April 2020 11:57 AM GMT
మహాతల్లివమ్మా..చాలా పెద్ద మనసు నీది

లాక్ డౌన్ రోజుల్లో ప్రజలు రోడ్లపై తిరగకుండా ఇంటి పట్టునే ఉండేందుకు పోలీసులను కాపలా పెట్టింది ప్రభుత్వం. ఎక్కడైనా, ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే పన్మిష్మెంట్లు ఇస్తున్నారు. కొన్ని చోట్ల జరిమానాలు విధిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే. ఎండనకా, వాననకా, రాత్రనకా, పగలనకా చెక్ పోస్ట్ లలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ రియల్ హీరోలకు కొన్ని ప్రాంతాల్లో స్వచ్చంధ సంస్థలు, హోటల్స్ భోజనాన్ని అందిస్తుండగా..మరికొన్ని చోట్ల స్థానిక ప్రజలే భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన సొంత డబ్బులతో పోలీసుల కోసం కూల్ డ్రింక్ బాటిల్స్ ను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందులో వింతేముంది. చాలామంది చేస్తున్నారుగా అనుకోకండి. ఆమె నెల జీతం రూ.3500. ఈ జీతంతో నెలంతా ఒక కుటుంబం గడవటమే కష్టం. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఈ మాత్రం ఉపాధి కూడా లేదు. అయినా మనకోసం కష్టపడుతున్న పోలీసులకు ఏదో ఉడత సాయం చేయాలనుకుంది ఆ తల్లి.

Also Read : నాగార్జునకి ఆ విషయంలో మంచి పట్టుందని చెప్పిన అమల

తుని లో ఉంటున్న మహిళ రెండు కూల్ డ్రింక్ బాటిళ్లను పోలీసులకు ఇవ్వబోతే..ఒక పోలీస్ ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీకు వచ్చే జీతంలో మాకోసం నువ్వు కూల్ డ్రింక్స్ కొనిస్తున్నావంటే నువ్వు నిజంగా మహాతల్లివమ్మా..చాలా పెద్ద మనసు నీది. మీరు ఇంట్లో ఉంటే చాలు. మాకు ఇంకేం అక్కర్లేదు. ఆ డ్రింక్స్ ఇంటికి తీసుకెళ్లి పిల్లలకివ్వమ్మా అని తమ వద్దనున్న జూస్ బాటిల్స్ కూడా పోలీసులు ఆమెకిచ్చారు. ఈ వీడియోను అల్లు శిరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నిజంగా ఆ మాతృమూర్తి చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



Next Story