హ్యాట్సాఫ్ జోసెలిన్ జేమ్స్.. అరెస్ట్ చేసిన అధికారినే కాపాడిన మ‌హిళ‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Sep 2020 8:44 AM GMT
హ్యాట్సాఫ్ జోసెలిన్ జేమ్స్.. అరెస్ట్ చేసిన అధికారినే కాపాడిన మ‌హిళ‌

మాన‌వ‌త్వం అనేది ఇంకా మ‌నుషుల్లో ఉంద‌న‌డానికి అడ‌పాద‌డ‌పా జ‌రిగే కొన్ని ఘ‌ట‌న‌ల ద్వారా నిరూపిత‌మ‌వుతూనే ఉంది. మ‌నిషికి మ‌నిషి సాయం చేయ‌డం మ‌నం చాలా సంధ‌ర్భాల్లో చూశాం. కానీ త‌న‌ను క‌ట‌క‌టాల్లోకి నెట్టిన ఓ అధికారికి ప్రాణ‌ధానం చేసి ఆ మ‌హిళ అంద‌రీ ప్ర‌శంస‌లు పొందుతుంది. ఆమె చేసిన సాయం నిజంగా మాటల్లో చెప్ప‌లేనిది. ‌

వివరాళ్లోకెళితే.. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన జోసెలిన్ జేమ్స్ అనే 40 ఏళ్ల మహిళ డ్రగ్స్‌కు బానిసైంది. దీంతో ఆమెను అక్కడి పోలీసులు 2007 నుంచి 2012 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ సుమారు 16సార్లు అరెస్టు చేశారు. అయితే.. ఆమెకు మెరుగైన వైద్యం, కౌన్సెలింగ్ ఇవ్వడంతో సాధారణ స్థితికి చేరుకుంది.

ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చూసిన‌ జోసెలిన్ జేమ్స్ షాక్‌కు గురైంది. డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారి టెర్రెల్ పాటెర్‌కు రెండు కిడ్నీలు పాడైపోయాయని.. గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీని దానం చేసే వారి కోసం ఆయన ఎదురుచూస్తున్నాడనేది ఆ పోస్టు సారాంశం.

దీంతో జోసెలిన్ జేమ్స్ తన కిడ్నీని టెర్రెల్ పాటెర్‌కు దానం చేయాలని నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని ఆమె.. టెర్రెల్ పాటెర్ కూతురుని సంప్రదించి చెప్పింది. ఈ క్రమంలో జోసెలిన్ జేమ్స్‌కు వైద్య పరీక్షలు చేసిన నాష్విల్లేలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ వైద్యులు.. శస్త్రచికిత్స ద్వారా ఆమె కిడ్నీని టెర్రెల్ పాటెర్‌కు అమర్చారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం బాగానే ఉందని వారు తెలిపారు. ఇప్పుడామే చేసిన సాయం ప‌ట్ల నెటిజ‌న్లు.. హ్యాట్స‌ఫ్ జోసెలిన్ జేమ్స్ అంటూ నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.

Next Story