సికింద్రాబాద్: పబ్లిక్ టాయిలెట్‌లో మహిళ మృతదేహం
By సుభాష్ Published on 8 Sept 2020 3:56 PM ISTసికింద్రాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బైబిల్ హౌస్ రైల్వే బ్రిడ్జి సమీపంలో పబ్లిక్ టాయిలెట్‌లో ఓ మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. టాయిలెట్‌లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళను ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా.. లేక ఇక్కడే చంపేసి వెళ్లిపోయారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే మహిళ ఒంటిపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ కేసును చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Next Story