నా భర్తను హత్య చేశాను.. నాకు ఉరిశిక్ష విధించండి అంటూ ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ వచ్చిన ఘటన అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.  హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ వద్దకు వచ్చిన ఆ మహిళ ఏడుస్తూ చెప్పిన మాటలను విన్న మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన హర్యానాలోని అంబాలలో చోటు చేసుకుంది. జంతర్‌ మంతర్‌ అనే కార్యక్రమానికి వచ్చిన హోంమంత్రి అనిల్‌కు సమస్యల విన్నవించేందుకు ప్రజలు బారులు తీరారు.

ఇదే సమయంలో సునీల్‌ కుమారి అనే మహిళ ఏడుస్తూ అక్కడికి వచ్చి తన భర్తను రెండేళ్ల క్రితం హత్య చేశానని, పశ్చత్తాపానికి గురవుతున్నానని, తాను చేసిన తప్పుకు ఉరిశిక్ష విధించాలని మంత్రిని లేఖ ద్వారా వేడుకుంది. ఆమె వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ మహిళ చెప్పిన మాటలు నిజమేనా..? లేక మతిస్థిమితం వల్లనో, ఇంకేమైన కారణాల వల్లనో అలా మాట్లాడుతుందా..?అని పోలీసులు విచారిస్తున్నారు. తన భర్తను తానే హత్య చేశానని మంత్రి ముందే చెప్పడం గమనార్హం.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.