భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలం రాళ్లగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

భార్య బావిలో దూకిందని గమనించిన భర్త వెంటనే ఆమెను రక్షించేందుకు బావిలో దూకాడు. అయితే శైలజను కాపాడేందుకు భర్త సాయికిరణ్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు భర్త సాయికిరణ్‌ను సురక్షితంగా బయటకు తీశారు. మృతురాలు శైలజ దంపతులకు తొమ్మిది నెలల పాప.

అమ్మ లేదని.. ఇక రాదని తెలియని ఆ పసికందు పాల కోసం తల్లడిల్లుతున్న దృశ్యం అక్కడివారి హృదయాలను కలచి వేసింది. దీంతో రాళ్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.