ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో వెంకీ సినిమా చేయ‌నున్నాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 6:10 AM GMT
ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో వెంకీ సినిమా చేయ‌నున్నాడా..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా త‌ర్వాత వెంకీ త‌మిళ చిత్రం అసుర‌న్ రీమేక్ లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.

త‌మిళంలో రూపొందిన అసుర‌న్ మూవీలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ జంట‌గా న‌టించారు. ఈ సినిమాను ఇప్పుడు క‌లైపులి థాను, డి.సురేష్‌బాబు తెలుగులో నిర్మించ‌నున్నారు. ఇటీవ‌ల ఈ మూవీని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది. అయితే.. త‌మిళంలో వెట్రిమార‌న్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నేది ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం.

తాజా స‌మాచారం ప్ర‌కారం... అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌, లై, ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ రీమేక్ ను తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై వెంకీ కానీ, సురేష్ బాబు కానీ స్పందిస్తారేమో చూడాలి.

Next Story