వన్యమృగాలను అంతమొందిస్తున్న గ్యాంగ్

By Newsmeter.Network  Published on  12 Dec 2019 7:04 AM GMT
వన్యమృగాలను అంతమొందిస్తున్న గ్యాంగ్

చిరుతపులి చర్మం, గోళ్ళ కోసం చిరుతపులిని చంపిన ఘటన ఆదిలాబాద్ జిల్లా లోని బజార్‌ హత్నూర్‌ మండలంలోని ఉమార్డ(బీ) గ్రామంలో జరిగింది. పంట పొలం చుట్టూ ఇనుప తీగల ఏర్పాటు చేసి . ఆ తీగలకు విద్యుతు సరఫరాను కలిపి చిరుత పులి ని చంపేశారు. అనంతరం ఆ చిరుతపులి చర్మం, గోళ్ళను, ఎముకలను, మాంసాన్ని సేకరించి మిగిలిన భాగాలని సమీపంలోని అడవిలో కాల్చివేశారు. ఇది గుర్తించిన కొందరు వ్యక్తులు అటవీ అధికారులకు తెలిపారు.

Puli 2

ఈ విషయంగా అటవీ అధికారులు విచారణ చేపట్టగా ఉమార్డ(బీ) గ్రామానికి చెందిన చౌహాన్‌ నాందేవ్‌ అనే వ్యక్తి గత కొంత కాలంగా అడవి జంతువులను చంపి వాటి మాంసాన్ని అదేవిధంగా జంతువుల చర్మాన్ని, కొమ్ములను విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని. అటవీ అధికారి ఇంచార్జి డీఎఫ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. చౌహాన్‌ నాందేవ్‌ తో పాటు అతనికి సహకరించిన సిడాం నాగోరావ్‌, పెందూరు నాగేందర్‌, మడాలి సునీల్‌, సోయం నాగేశ్వర్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

Puli 3

వీరితో పాటు ఇంకా ఇద్దరు నిందితులు ఉన్నారన్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా వీరి దగ్గరి నుండి చిరుత పులి చర్మాన్ని, గోళ్ళను పులిని అహతమార్చడానికి ఉపయెగించిన ఇనుప తీగలను, గొడ్డళ్ళను స్వాధీన పరుచుకున్నారు.

Next Story