పంటను కాపాడుకునేందుతు రైతన్న వినూత్న ఆలోచన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 8:33 AM GMT
పంటను కాపాడుకునేందుతు రైతన్న వినూత్న ఆలోచన

ఖమ్మం : కోతుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం జానకీపురానికి చెందిన యనమద్ది సతీశ్ అనే ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. తనకు తానే ఎలుగుబంటి వేషం వేసుకుని పొలం చుట్టూ తిరుగుతూ పంటను కోతులు నాశనం చేయకుండా కాపాడుకుంటున్నాడు. సతీశ్ కు జానకీపురం గ్రామ శివార్లలో 20 ఎకరాల భూమి ఉండగా 10 ఎకరాల్లో పత్తి, వరి సాగుచేశాడు. అయితే సాగు చేసిన పత్తి, వరి పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి. పత్తికాయలను తుంపి పారేయడం, వరిని తినేస్తున్నాయి. పొలాలు ఊరికి దూరంగా ఉండటంతో పంటను కాపాడుకోవడం సతీశ్ కు తలభారమయింది. అప్పుడు వచ్చిన ఆలోచనే అతను ఎలుగుబంటి వేషధారణకు కారణమయింది. రూ.5 వేలు వెచ్చించి సతీశ్ ఎలుగుబంటి డ్రస్ ను కొనుగోలు చేశాడు. రోజు దానిని వేసుకుని తన పొలాల చుట్టూ తిరుగుతూ కోతులను తరిమికొడుతున్నాడు. నిజంగానే ఎలుగబంటి వచ్చిందని భయపడుతున్న కోతులు పారిపోతున్నాయి.

Next Story