ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

By Medi Samrat  Published on  11 Oct 2019 6:14 AM GMT
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను పథకం ప్రకారం భార్య హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లా పానుగల్ మండలం కేతేపల్లికి చెందిన భర్త ఆంజనేయులును భార్య రాములమ్మ, ప్రియుడు సలీంతో కలిసి హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చింతకుంట మండలం మద్దూరులో 15 రోజుల క్రితం భార్యను చూడటానికి వెళ్లిన భర్త ఆంజనేయులును హత్య చేసి పంట పొలంలో పాతిపెట్టారు. అయితే ఆంజనేయులు కనిపించకపోవడంతో బంధువుల స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆంజనేయులును భార్య రాములమ్మే హత్య చేసిందని తేల్చారు. మద్దూరు శివారులోని పొలంలో పూడ్చిన ఆంజనేయులు మృతదేహన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సలీం, రాములమ్మ, తమ్ముడు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story
Share it