కొన్ని చిన్న చిన్న విషయాలే కుటుంబాల్లో చిచ్చురేపుతుంటాయి. చిన్న చిన్న కలహాల వల్లనే ప్రాణాల మీదకొస్తుంటాయి. అనుమానం పెనుభూతం లాంటిదంటారు. అనుమానాలతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఓ మిస్ట్‌ కాల్‌తో ఓ వివాహిత నిండుప్రాణం బలి తీసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన సుబ్బారావు, కోటేశ్వరమ్మ (30) భార్యాభర్తలు.

గత కొంత కాలంగా సుబ్బారావు భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని వేధింపులు మొదలు పెట్టేవాడు. ఈ అనుమానమే తరచూ గోడవలకు దారి తీసింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భార్య కోటేశ్వరమ్మ ఫోన్‌కు ఓ మిస్డ్‌ కాల్‌ వచ్చింది. ఈ మిస్డ్‌ కాల్‌ను గమనించిన భర్త సుబ్బారావు గొడవకు దిగినట్లు తెలుస్తోంది.

ఇలా ఇద్దరి మధ్య తీవ్ర వాదన కొనసాగడంతో ఆగ్రహించిన భర్త భార్యను దారుణంగా హత్య చేశాడని తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుభాష్

.

Next Story