దేశంలో అక్రమ సంబంధాల వ్యవహారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల భార్యాభర్తలు విడిపోవడమే కాదు.. ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అక్రమ సంబంధాలు సంసారాల్లో పెద్ద చిచ్చేపెట్టేస్తాయి. కొందరు పెళ్లైన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నా.. తర్వాత పక్కదారులు పడుతున్నారు.

పని మనిషితో రాసలీలలు చేస్తున్నభర్తకు భార్య అదిరిపోయే షాకిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని దోన్‌గర్‌ఘడ్‌కు చెందిన కిషన్‌ అనే వ్యక్తి భార్య కుసుమ్‌తో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. వారింట్లో ఓ మహిళ పని మనిషిగా చేస్తోంది. పని మనిషిపై కన్నేసిన కిషన్‌ .. అప్పుడప్పుడు అవసరానికి డబ్బులిస్తే లొంగదీసుకున్నాడు. అంతేకాదు భార్య ఇంట్లో లేని సమయంలో ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లి రాసలీలలు సాగించేవాడు. అయితే అకస్మాత్తుగా ఇంటికొచ్చిన భార్య.. భర్త చేసిన పాడుపనిని చూసి షాకైంది. ఈ విషయాన్ని బయటపెడితే ఇంటి పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవ్వరికీ చెప్పకుండా ఉండిపోయింది.

ఇక భార్య అమాయకత్వాన్ని అలుసుగా చేసుకున్న కిషన్‌.. భార్య ఎదుటే పనిమనిషితో రాసలీలలు చేయడం ప్రారంభించాడు. తనకు అన్యాయం చేయవద్దని భార్య కుసుమ్‌ వేడుకున్నా ఏమాత్రం ఊరుకునేవాడు కాదు. పైగా కిషన్‌ భార్య కుసుమ్‌ను చిత్ర హింసలకు గురి చేయడం ప్రారంభించాడు. భార్య ఎదుటే పనిమనిషితో రాలీలలు కొనసాగించడం ఇంకా ఎక్కువ చేసేవాడు. దీంతో భర్త చేస్తున్న పాడుపనిని తట్టుకోలేకపోయిన భార్య విసుగెత్తి.. భర్త భాగోతాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంది. ఎప్పటిలాగే పని మనిషితో రాసలీలలు కొనసాగిస్తున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా భార్య సెల్‌ఫోన్‌తో ఇంటి కిటికీలోంచి ఫోటోలు, వీడియోలు తీసింది.

తర్వాత బంధువులు, ఇరుగుపొరుగువారిని పిలిచి వారిద్దరి భాగోతాన్ని బయటపెట్టింది భార్య. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని సాక్ష్యాలైన ఫోటోలు, వీడియోలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.