ఆ మహిళ అసహజ కోరికలే.. ఆ భర్త ప్రాణాలు తీశాయి.!

By Medi Samrat  Published on  8 Nov 2019 7:23 AM GMT
ఆ మహిళ అసహజ కోరికలే.. ఆ భర్త ప్రాణాలు తీశాయి.!

ముఖ్యాంశాలు

  • అవమాన భారంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
  • రెండు అంతస్థుల భవనంపై నుండి దూకి ఆత్మ‌హ‌త్య‌

సమాజమే సిగ్గు పడేలా ఆ మహిళ సాగించిన అసహజ శృంగారం.. చివరికి భర్త ప్రాణాలనే బలితీసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. భార్య చేసిన పనికి సిగ్గుపడి.. అవమానభారంతో ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలు మారుతీ నగర్​లోని ఓ భవనం రెండో అంతస్తులో ఏడుకొండలు, సుమలత దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. ఏడుకొండలు ఆటోలు నడపడం, నూడిల్స్ బండ్లు ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషిస్తుండగా.. సుమలత మాత్రం గృహిణిగా ఇంటికే పరిమితమైంది. ఇంటి దగ్గరే ఉండే ఆమె... తనకు పరిచయమున్న కళాశాల విద్యార్థినులకు మాయ మాటలు చెప్పి లోబర్చుకోవడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా... ఆన్​లైన్ షాపింగ్ ద్వారా సెక్స్ టాయ్స్ ఇంటికి తెప్పించుకుంది. మగవాడి వేషధారణ ధరించి సెక్స్ టాయ్స్ ఉపయోగించి బాలికలతో విశృంఖల శృంగారం చేస్తుండేది. సుమలత అసహజ శృంగారాన్ని భరించలేని జరుగుమల్లికి చెందిన ఓ బాలిక... జిల్లా ఎస్పీకి 'స్పందన' కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.

ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సుమలత వ్యవహారంపై దృష్టి పెట్టారు. మారుతీ నగర్​లోని ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేశారు. సుమలత భర్త ఏడుకొండలు సమక్షంలోనే ఇంట్లో సోదాలు చేయగా... భర్తకు విస్తుపోయే వస్తువులు కనిపించాయి. ఇంట్లోని ఒక సంచిలో దాచి ఉంచిన పలు రకాల సెక్స్ టాయ్స్ బయటపడ్డాయి. ఈ అవమాన భారం భరించలేని భర్త ఏడుకొండలు.. రెండో అంతస్థులోంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని పోలీసులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏడుకొండలు చనిపోయాడు. అనంతరం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించిన పోలీసులు శవ పంచనామా పూర్తి చేశారు. ఈ ఘటనకు కారణమైన మహిళ సుమలతను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Next Story
Share it