టీడీపీ నేత తిక్కారెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 1:03 PM GMT
టీడీపీ నేత తిక్కారెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారు?

కర్నూలు: మంత్రాలయం టీడీపీ ఇన్చార్జీ పి.తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని తిక్కారెడ్డి నివాసానికి హైదరాబాద్ పోలీసులు చేరుకున్నారు. గంట పాటు తిక్కారెడ్డితో పోలీసులు మాట్లాడారు. అనంతరం తిక్కారెడ్డిని హైదరాబాద్‌ తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసుల సాయం తీసుకున్నారు. హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ వద్ద తిక్కారెడ్డి భాగస్వామిగా ఏర్పాటు చేసిన మద్యం పరిశ్రమకు తీసుకున్న వరి పొట్టు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదని వ్యాపారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష టన్నుల వరి పొట్టుకు రూ.12 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో తిక్కారెడ్డిని 3వ ముద్దాయిగా చేర్చినట్లు తెలుస్తోంది. తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it