తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చే సమయంలో టెక్నికల్‌ సమస్యలు తలెత్తాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాల్‌ టికెట్ల జారీ విషయంలో యూనివర్సిటీ సిబ్బంది పొరపాటు చేశారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల అడ్రస్‌లు ముద్రించటంలో జరిగిన పొరపాటు వల్లే ఈ పరిస్థితులు ఏర్పాడ్డాయని విద్యార్థులు వాపోయారు. యూనివర్సిటీ పరిధిలో 63 కేంద్రాల్లో 75,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 14, 15వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను టెక్నికల్‌ సమస్యల కారణంగా వాయిదా వేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో రెండు పరీక్షా కేంద్రాల్లో ఒక్క విద్యార్థి కూడా పరీక్షకు హాజరుకాకపోవటం.. హాల్‌టికెట్ల జారీ విషయంలో జరిగిన అలసత్వానికి నిదర్శనంగా కనబడుతోంది. కాగా ఈ విషయమై ఇప్పటి వరకూ యూనివర్సిటీ అధికారులు స్పందించలేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.