ముఖ్యాంశాలు

  • సీఎస్ ఎల్వీఎస్ బదిలీపై స్పందించిన పవన్
  • కోరి తెచ్చుకున్నారు..బదిలీ ఎందుకు చేశారు?
  • మంత్రి అవంతి వ్యాఖ్యలపైనా పవన్ ఆగ్రహం

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బదిలీ వ్యవహారంలో క్లారిటీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “అవంతిగారు కాలేజీలు మూసేసిరాజకీయాల్లో ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్..వ్యాపారాలు మానేసి రాజకీయాల్లో ఉన్నారా అని ప్రశ్నించారు. సినిమాలు చేస్తానో లేదో తెలియదని..నిర్మాతగా సినిమాలు నిర్మిస్తానన్నారు పవన్ కల్యాణ్

సీఎస్ బదిలీపై ప్రజలకు నిజం చెప్పాలి:సీపీఐ రామకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అర్ధాంతరంగా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ఈ మార్పు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఐఏఎస్ అధికారుల మధ్య వివాదాలా, ముఖ్యమంత్రితో వైరుధ్యమా, లేక మారేదన్నా కారణమా అనేది ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు రామకృష్ణ.

 సీఎస్ బదిలీ వెనుక నియంతృత్వ ధోరణి కనిపిస్తుందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ కన్నా

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.