షైన్ ఆస్పత్రి ఘటనలో కోర్టు పోలీసులను ఎందుకు తప్పుబట్టింది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 1:00 PM GMT
షైన్ ఆస్పత్రి ఘటనలో కోర్టు పోలీసులను ఎందుకు తప్పుబట్టింది..?

రంగారెడ్డి: షైన్‌ ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనలో ఎల్బీనగర్‌ పోలీసులకు రంగారెడ్డి కోర్టు మొట్టికాయలు వేసింది. ఈ ఘటనలో నిందితులపై 304A బెయిలబుల్‌ కేసులను పోలీసులు నమోదు చేశారు. అయితే చిన్నారుల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి.. ప్రాణాలు కోల్పోయినప్పుడు 304A కేసు ఎలా పెడతారాంటూ పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 304A సెక్షన్‌ను 304పార్ట్‌(II)గా మార్చి నిందితులను కోర్టు రిమాండ్‌కు తరలించింది. షైన్‌ ఆస్పత్రి ఎండీ సునీల్‌ కుమార్‌ రెడ్డితో పాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేసి పోలీసులు చర్లపల్లి జైలుకు రిమాండ్‌ తరలించారు. సోమవారం షైన్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 4 నెలల బాలుడు మృతి చెందగా.. మరో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు.

Next Story