ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఈ మ‌ధ్య ఏమైంది. ఒక్కొక్క‌రుగా మానసిక సమస్యల బారిన ప‌డుతూ జ‌ట్టుకు దూర‌మ‌వుతున్నారు. ఇప్పటికే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, నిక్‌ మ్యాడిసన్‌లు తమకు మానసిక సమస్యలు ఉన్నాయని బ్రేక్‌ తీసుకోగా.. ఇప్పుడు ఈ జాబితాలో విల్‌ పుకౌస్వి చేరాడు.

ఇటీవల దేశవాళీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన విల్‌ను పాక్‌తో జరుగనున్న సిరీస్‌కు జట్టులోకి తీసుకోవాలని సీఏ భావించింది. అయితే తనకు మానసిక సమస్యలు ఉన్నాయంటూ అతను సీఏకు విన్నవించాడు. ఈ విషయాన్ని ప్రకటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. విల్‌ పేరును పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది.

అంతేకాకుండా.. విల్‌ మానసికంగా ఇబ్బంది పడుతున్న కారణంగానే తాను తప్పుకుంటున్నట్లు పేర్కొన్నట్లు సీఏ తెలిపింది. దీంతో ఆసీస్‌ క్రికెటర్లకు ఏమైందనే చర్చనడుస్తోంది. రెండు వారాల వ్యవధిలో ఒకే కారణంతో ముగ్గురు ఆటగాళ్లు మానసిక కారణాలు చెబుతూ తప్పుకోవడం ఏమిటనేది క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

2 comments on "ఆ దేశ‌ క్రికెట‌ర్ల‌కు ఏమైంది.. ఒక్కొక్క‌రుగా జ‌ట్టును వీడుతున్నారు.!"

Comments are closed.