బిగ్ బాస్ - 3 విజేత రాహుల్ సిప్లిగంజ్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Nov 2019 4:09 PM GMTముఖ్యాంశాలు
- విజేతగా అవతరించిన రాహుల్
- శ్రీముఖిని వెనక్కినెట్టిన రాహుల్
- ప్రేక్షకుల ఓటుతో విజేతగా నిలిచిన రాహుల్
- రన్నరఫ్ గా నిలిచిన శ్రీముఖి
- విజేత ట్రోపీ అందించిన చిరు, నాగార్జున
- చాలా వ్యూహాత్మకంగా గేమ్ ఆడిన రాహుల్
�
ఆట ఆడలేని వాడే గెలిచాడు. ఎవరు తోపులు అనుకున్నారో వారు వెనక్కిపోయారు. పోతాడు అనుకున్నవాడే తోపు అయ్యాడు. అందుకే..ఎవర్నీ తక్కువుగా అంచనా వేయకూడదు. రాహుల్ తో నే ప్రేక్షకులు ఎందుకున్నారు..? ఆయనకే ఓటు ఎందుకు వేశారు..?
సమయాన్ని పట్టి నడుచుకోవాలి. సమయాన్ని పట్టి మాట్లాడాలి, ఆడాలి. రాహూల్ బిగ్ బాస్ హౌజ్‌లో చేసింది ఇదే. ఎదుటి వారి వీక్నీస్‌ను పట్టుకుని రాహుల్ గేమ్ ఆడాడు.శ్రీముఖి గెలుస్తుందని సోషల్ మీడియా హోరెత్తింది. ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో చాలా మంది వచ్చారు. కాని..రాహుల్ వెంటే బిగ్ బాస్ అభిమానులు నిలిచారు.
రాహుల్ గెలపులో జగన్ అభిమానుల కీలక పాత్ర..!
రాహుల్ సిప్లిగంజ్..విజయంలో జగన్ అభిమానుల పాత్ర కూడా ఉందంటున్నారు. ఎన్నికలకు ముందు రాహుల్ జగన్ ఇమేజ్ ను హైలెట్ చేస్తూ పాటలు పాడారు. ఈ పాటలు జగన్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో..పాతబస్తీ కుర్రాడు రాహుల్‌ను గెలిపించాలంటూ జగన్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద డ్రైవే నిర్వహించారు.