అట్లీ మ‌న‌సు దోచుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 6:30 AM GMT
అట్లీ మ‌న‌సు దోచుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రు..?

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు తీస్తూ... అన‌తి కాలంలోనే మంచి పేరు సంపాదించిన త‌మిళ‌ ద‌ర్శ‌కుడు అట్లీ. తాజాగా అట్లీ తెర‌కెక్కించిన చిత్రం విజిల్. ఈ సినిమాకి తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నది. అయితే... ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ వ‌చ్చిన అట్లీ మీడియాతో మాట్లాడుతూ... చిత్ర విశేషాల‌ను తెలియ‌చేసారు. తెలుగులో సినిమా చేయ‌డం గురించి చెబుతూ...తెలుగు సినిమా చేయ‌డం అనేది త‌న క‌ల అని.. భ‌విష్య‌త్‌లో ఖ‌చ్చితంగా తెలుగు సినిమా చేస్తాన‌న్నారు. అయితే... ఎవ‌రితో చేస్తాడు అనేది చెప్ప‌లేదు కానీ.. తెలుగులో ఎన్టీఆర్ అంటే అభిమానం అని చెప్పాడు. త‌న సినిమాలు చూసి బాగున్నాయి అంటూ అభినందిస్తుంటారు. ఆయ‌న చూపించే ప్రేమ‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను అంటూ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

గ‌త సంవ‌త్స‌ర‌మే ఎన్టీఆర్‌కు అట్లీ క‌థ చెప్పాడు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. వ‌చ్చే సంవ‌త్స‌రంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... అట్లీ షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. విజిల్ రిలీజ్ హాడావిడి అయిన త‌ర్వాత షారుఖ్ ఖాన్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడు. అందుచేత ఎన్టీఆర్ - అట్లీ మూవీ 2021లో ఉండ‌చ్చు అని తెలిసింది.

Next Story