యూజర్లకు మరోసారి హెచ్చరించిన 'వాట్సాప్‌'

By సుభాష్  Published on  26 Dec 2019 12:42 PM GMT
యూజర్లకు మరోసారి హెచ్చరించిన వాట్సాప్‌

వాట్సాప్ సంస్థ మరోసారి యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరి 1 నుంచి పాత వర్షన్ న్న అండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని పేర్కొంది. ఆండ్రాయిడ్‌ 2.3.7 కన్న తక్కువ వర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఫోన్లతో పాటు ఐఓఎస్‌ 8కన్న తక్కువ వర్షన్‌ ఓఎస్‌ ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ నిలిచిపోతుందని సంస్థ వెల్లడించింది. అటు డిసెంబర్‌31 నుంచి అన్ని విండోస్‌ ఫోన్లలో వాట్సాప్‌ పని చేయడం ఆగిపోతుందని తెలిపింది.ఇక పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని, అందుకే పాత ఓఎస్‌ ఉన్న ఫోన్లకు ఈ వాట్సాప్‌ సేవల్సి నిలిపివేస్తుట్లు చెబుతోంది. దీనిపై వాట్సాప్‌ వినియోగదారులు ఎవరు కూడా టెన్షన్‌ పడవద్దని, ఆండ్రాయిడ్‌ 2.3.7 లేదా పైన నడుస్తోన్న పరికరాలు కేవలం కేవలం 03 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. కాగా, 2019 డిసెంబర్ 31 తర్వాత వీటికి వాట్సాప్ నుంచి ఎటువంటి అప్ డేట్స్ రావు. ఈ విషయాన్ని ఇది వరకే సూచించడం జరిగిందని, ఇక 2019 ముగిసిపోతున్న తరుణంలో మరోసారి ఈ విషయాన్ని యూజర్లకు తెలియజేస్తున్నామని ప్రకటించింది.

వాట్సాప్ ఈ ఫోన్లకు సపోర్ట్ ను ఎందుకు నిలిపి వేస్తుందంటే..

తాము ఇకపై అందించే ఫీచర్లను అందుకోగల సామర్థ్యం ఈ ఆపరేటింగ్ సిస్టంలకు ఉండదని వాట్సాప్ పేర్కొంది. ఈ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఫోన్లకు అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. 2009లో తాము వాట్సాప్ ను ప్రారంభించినప్పటికీ, ఇప్పటికీ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయని, అప్పట్లో మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో 70 శాతం వరకు బ్లాక్ బెర్రీ, నోకియాలు అందించే ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసేవని తెలిపింది. ఇప్పుడు మార్కెట్లో 99.5 శాతం ఘా ఉన్న గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్లు అప్పట్లో కనీసం 25 శాతం కూడా లేవని తెలిపింది.

Next Story