యూజర్ల వివరాల గోప్యతకు వాట్సాప్ కొత్త యాప్..!
By న్యూస్‌మీటర్ తెలుగు
యూజర్లకు వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్లకు సంబంధం లేకుండా ఏ గ్రూపులలో అయిన వారిని చేర్చేయొచ్చు. దీంతో యూజర్లు వ్యక్తిగత చాటింగ్ కోసం వేరేగా చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో.. వాట్సాప్ కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది.
దీనిలో యూజరు అనుమతించిన వారు మాత్రమే గ్రూప్స్‌లో చేర్చే వీలుంటుంది. యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్‌లో చేర్చే వీలుండదు. ఇందుకు సంబంధించి ప్రస్తుత యాప్‌లో ఉన్న 'నోబడీ' ఆప్షన్ స్థానంలో 'మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్' అనే ఆప్షన్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీంతో గ్రూప్స్‌లో తనను చేర్చేందుకు యూజరే నిర్ణయించుకోవచ్చని సంస్థ తెలిపింది. దీంతో యూజరు తనకు నచ్చిన వారి గ్రూప్‌లోనే ఉంటుంది. అయితే ..యూజరును నేరుగా గ్రూప్‌లో చేర్చేందుకు, అనుమతి లేనివారు.. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు వ్యక్తిగత చాటింగ్ ద్వారా వారికి ప్రైవేటుగా ఆహ్వానం పంపాల్సి ఉంటుంది. దీనిపై యూజరు నిర్ణయం తీసుకోవచ్చు. పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్ ద్వారా నిఘా పెట్టేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. .