విజయవాడ: కొత్తూరు తాడేపల్లిలో గోశాలలో ఆవుల మృతి ఘటనపై సిట్‌ దర్యాప్తు పూర్తయ్యింది.

సీపీకి అధికారులు నివేదిక సమర్పించారు. పశుసంవర్ధక శాఖకు చెందిన పలు బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి.

పశుగ్రాసంలో చేరిన టాక్సిసిటీ వలనే ఆవులు చనిపోయినట్టు సిట్‌ బృందం వెల్లడించింది. ఆగస్టు 10న అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో 90కిపైగా ఆవులు మరణించాయి.

ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన గడ్డిలో రసాయనాల శాతం అధికంగా ఉన్నట్టు పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు.

ఆవుల బ్లడ్‌ శాంపిల్స్‌, గడ్డి, దాణా నమునాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షించారు. దీంతో ఆవులు టాక్సిసిటీ అధికంగా ఉన్న పశుగ్రాసం తినడం వల్లే అవి నైట్రెట్లుగా మారి పశువుల ప్రాణం తీసినట్టు అధికారులు నివేదికలో వెల్లిడించారు.

కాగా ఆవుల మృతిపై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని గో ప్రేమికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.