'భీష్మ' టీజ‌ర్ టాక్ ఏంటి..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 6:20 AM GMT
భీష్మ టీజ‌ర్ టాక్ ఏంటి..?

నితిన్, రష్మిక మందాన, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. కథానాయకుడు నితిన్ 'నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా...కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం' అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియో కి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ... 'భీష్మ' చిత్ర కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుందన్నారు.

Next Story