అఫ్గాన్‌పై వెస్టిండీస్‌ భారీ విజయం

By Newsmeter.Network  Published on  29 Nov 2019 10:04 AM GMT
అఫ్గాన్‌పై వెస్టిండీస్‌  భారీ విజయం

అఫ్గాన్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. అఫ్గాన్‌ రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 109/7తో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కానీ.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. విండీస్ సారథి జేసన్ హోల్డర్‌ (3/20) ధాటికి 120 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 31 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వికెట్‌ కోల్పోయింది.. ఈ మ్యాచ్‌లో పది వికెట్లతో అఫ్గాన్‌ పతనాన్ని శాసించిన విండీస్‌ బాహుబలి కార్న్‌వాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ విజయంతో వెస్టిండీస్‌ జట్టు అరుదైన రికార్డు సాధించింది. భారత్‌లో ఫీల్డింగ్ ఎంచుకుని గెలిచిన మూడో పర్యాటక జట్టుగా రికార్డు సృష్టించింది.

Next Story
Share it