వైన్స్‌ షాపు వద్ద నిద్రిస్తున్న వాచ్‌మెన్‌పై పెట్రోల్‌ పోసి సజీవదహనం చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముళ్లపూడి వెంకటేష్‌ అనే వ్యక్తి ప్రభుత్వ వైన్స్‌ షాపు వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

రోజువారీగా నిన్న అర్థరాత్రి విధులు నిర్వహిస్తూ మంచంపై పడుకున్న వెంకటేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. అయితే షాప్‌లో దొంగతనాలు జరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, వ్యక్తిగత కక్షలతో వెంకటేష్‌ను ఇలా సజీవ దహనం చేశారా.. లేక ఇంకేమైన కారణాలున్నాయా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.