రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు గ్రామ ప్రజలు కరోనా వైరస్ సోకి ఇంటికి వచ్చిన మహిళకు ఘనస్వాగతం పలికారు. పొద్దుటూరు గ్రామానికి చెందిన పద్మ నీలోఫర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. తనవిధి నిర్వహణలో భాగంగా తనకు కూడా కరోనా వ్యాధి సోకింది. అయితే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందింది. గత నాలుగు రోజుల క్రితం ఆమెకు పలు దఫాలుగా టెస్టులు నిర్వహించగా.. నెటిగివ్ వచ్చింది. దీంతో పద్మ తిరిగికి తన స్వగ్రామానికి చేరుకుంది. తన కూతురు ఆకాంక్షతో కలిసి గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు పూలుచల్లి ఘన స్వాగతం పలికారు. దీంతో గ్రామస్తులు చూపిన మర్యాదకు పద్మ సంతోషం వ్యక్తం చేశారు.