ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ.. సత్యసాయి జిల్లాలో సరికొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించే అవకాశం ఉంది.
By M.S.R Published on 26 Jan 2025 11:31 AM ISTఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ.. సత్యసాయి జిల్లాలో సరికొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించే అవకాశం ఉంది. జనవరి 26 నుంచి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలోని పరిసర ప్రాంతాలలో ఈశాన్య రుతుపవనాల వర్షాలు ఆగిపోయేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.
ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి డిసెంబర్ 31న ముగియాల్సి ఉంది. అయితే ఈశాన్య రుతుపవనాలు శనివారం వరకు కొనసాగాయి. అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్ సాధారణ వర్షపాతం 287.2 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది 316.2 మిమీ వర్షపాతం నమోదైంది. 10 శాతం అధికంగా నమోదైంది. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 360 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో సాధారణ వర్షపాతం 127.3 మిల్లీమీటర్ల వర్షపాతం కాగా.. రికార్డు స్థాయిలో 108 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరిలో సీజన్‌లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 63.1 మి.మీ.కు గాను 31.4 మి.మీ. మాత్రమే నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.