జీవో 2430పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతాం...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 11:17 AM GMT
జీవో 2430పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతాం...

ప్రకాశం: జీవో 2430పై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుతామన్నారు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు జీవో 2430 కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశామన్నారు. ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ మద్దతుతో జీవో 2430ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి అందరి మద్దతు కూడగడతామని... ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులను కలిసి ఉద్యమిస్తామని ఐ.వి.సుబ్బారావు పేర్కొన్నారు. ఈ జోవోను తీసుకురావాల్సిన అవసరం లేదని అందరూ భావిస్తున్నారు. నిరాధార వార్తలు రాస్తే ప్రభుత్వం కోర్టులో కేసులు వేయవచ్చు. కానీ జీవో ద్వారా ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలు ఎత్తిచూపితే వారిపై కేసులు పెడతామనటం సరైన పద్ధతి కాదని ఐ.వి.సుబ్బారావు చెప్పారు.

ఏపీయూడబ్ల్యూజే చేసే ప్రతి ఉద్యమానికి ఐజేయూ మద్దతు ఇస్తుందన్నారు. దేవులపల్లి అమర్‌ ప్రభుత్వ ప్రతినిధిగా మాత్రమే అభిప్రాయాన్ని ఇచ్చారు, దానికి యూనియన్‌కు సంబంధం లేదని తెలిపారు. జర్నలిస్టులకు సమాచార మంత్రి కులాలను ఆపాదించటం సరికాదు. రాజన్న రాజ్యం తీసుకువస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌.. వైఎస్సార్‌ కంటే గొప్పవారు కాదు. ప్రతికా స్వేచ్ఛకు భంగం వాటిల్లితే ఏపీయూడబ్ల్యూజే ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఐ.వి. సుబ్బారావు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీడియాపై విడుదల చేసిన 2430 జీవో అంశాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సూమోటాగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార ముఖ్య కమిషనర్‌ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నోటీసులు జారీ చేసింది.

Next Story
Share it