కృష్ణా: సిపెట్‌లో ట్రైనింగ్‌ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇలాంటి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇండస్ట్రీని కవర్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్‌లు ప్రారంభించబోతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. దేశంలోనే మొదటిసారి 75 శాతం లోకల్‌ వారికి ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేశామన్నారు. చట్టంతో పాటు బాధ్యతగా పారిశ్రామిక వేత్తలకు స్కిల్‌ ఉన్న వారిని అందించాలన్నారు. పరిశ్రమలకు కావాల్సిన విధంగా యువతను శిక్షణ ఇస్తామని.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ప్రభుత్వం ధ్యేయమని సీఎం జగన్‌ అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.