కరోనాకు మందు కనిపెట్టామన్న అమెరికా డాక్టర్‌

By అంజి  Published on  1 April 2020 3:32 PM GMT
కరోనాకు మందు కనిపెట్టామన్న అమెరికా డాక్టర్‌

అమెరికా: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌కు మందు కనిపెట్టామని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌విల్లె ప్రకటించారు. సార్స్‌ వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు వాడిన యాంటీ బాడీస్‌నే దీనికి వాడినట్లు ఆయన చెప్పారు. కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసే ప్రయోగంపై తమ బృందం విజయం సాధించిందని డిస్ట్రిబ్యూటెడ్‌ బయో ల్యాబ్‌కు సీఈవో వ్యవహరిస్తున్నా గ్లాన్‌విల్లె పేర్కొన్నారు. సార్స్‌ వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీ బాడీస్‌పై విస్తృత పరీక్షలు చేసినట్లు ఆయన చెప్పారు.

ఐదు యాంటీ బాడీస్‌తో లోతుగా పరీక్షలు నిర్వహించామని ఆయన వెల్లడించారు. సార్స్‌ వైరస్‌ను చంపే యాంటీ బాడీస్‌తోనే తమ ప్రయోగం ఫలించదని గ్లాన్‌విల్లె చెప్పారు. మనిషి శరీరంలోకి కరోనా వైరస్‌ ఎస్‌-ప్రోటీన్ కణాల ద్వారా ప్రవేశిస్తుందన్నారు. ఎస్‌-ప్రోటీన్‌ను తాము ఉపయోగించిన యాంటీ బాడీస్‌ నిర్వీర్యం చేసిందని డాక్టర్‌ గ్లాన్‌విల్లె తెలిపారు. త్వరలోనే దీనిని మనుషులపై ప్రయోగించి.. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేస్తామన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా తాము ముమ్మరం చేశామన్నారు. అయితే సెప్టెంబర్‌ నెలలో కరోనా వైరస్‌ మందు అందుబాటులోకి రావచ్చని ఆయన అన్నారు. మరో రెండు ల్యాబ్‌ల సాయంతో మేం చేసిన ప్రయోగ ఫలితాలను నిర్దారించుకుంటామని తెలిపారు.

Also Read: కరోనా: వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రి డాక్టర్‌ ఐ ఫెన్‌ అదృశ్యం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 8 లక్షల 60 వేలు దాటింది. కరోనా బారిన పడి 42 వేలకుపైగా ప్రజలు మరణించారు. అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,89,633కు చేరుకుంది. ఇక ఫ్రాన్స్‌ దేశంలో గడిచిన 24 గంటల్లో 499 మంది మృతి చెందారు.

Next Story