రెండో రాజధాని ప్రతిపాదన మా దగ్గర లేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2019 10:53 AM GMT
రెండో రాజధాని ప్రతిపాదన మా దగ్గర లేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిబుల్‌ తలాక్‌ బిల్లులను తీసుకువచ్చామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు రేపటి నుంచి మొదలవుతాయని తెలిపారు. ప్రతిపక్షాలు ఏ అంశంపై చర్చించిన దానికి మేము సిద్ధమేనన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ ప్రశాంతంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో మా ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యా విధానం, వైద్య విధానం, నదుల అనుసంధానంపై చర్చ జరుపుతామన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు, వైద్యం, విద్య వంటి మౌళిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయమని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని అనే ప్రతిపాదన మా దగ్గర లేదన్నారు. ఉగ్రవాదంపై జీరో టాలేరెన్స్‌ పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్యాయం చేసుకొని పని చేస్తామని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్ఱభుత్వ పరిధిలోని అంశం.. రాష్ట్రం ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికులతో చర్చలు జరపాలపన్నారు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని గత కాంగ్రెస్‌ కానీ, బీజేపీ కానీ ఎక్కడా చెప్పలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చామన్నారు. పునర్విభజన చట్టంలో కాళేశ్వరంకు జాతీయ హోదా అంశం బిల్లులో ఎందుకు పెట్టించలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

Next Story
Share it