అద్దాలు వాడుతున్నారా.. చాలా జాగ్రత్త పడాల్సిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2020 6:10 AM GMT
అద్దాలు వాడుతున్నారా.. చాలా జాగ్రత్త పడాల్సిందే..!

ఆసుపత్రికి లేదా ఫార్మసీకి వెళ్ళొచ్చినప్పుడు అద్దాలను ఎప్పుడైనా కడుక్కున్నారా..? లేదు అన్నారంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేసినట్లే..! ఇక నుండి అయినా అద్దాలు వాడేవారు పూర్తీ శానిటైజేషన్ చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే అద్దాల మీద ఏకంగా తొమ్మిది రోజుల పాటూ కరోనా వైరస్ ఉండగలదట. బయట నుండి ఇంట్లోకి కరోనా వైరస్ తీసుకుని వెళ్ళడానికి అద్దాలు దోహద పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లే సమయంలో మూతిని, ముక్కును మాస్కులతో కప్పేసుకుంటూ ఉన్నారని.. అదే జాగ్రత్త అద్దాల విషయంలో కూడా తీసుకోవాలని.. ఇంటి లోకి తీసుకుని వచ్చే ముందు కానీ రాగానే కానీ శానిటైజ్ చేసుకుంటే అందరికీ మంచిదని కంటి నిపుణులు చెబుతున్నాయి.

లైట్ డిష్ వాషర్ సోప్ ను ఉపయోగించి నీటితో కడగాలని.. ఆ తర్వాత మైక్రో ఫైబర్ క్లాత్ తో కడిగితే మంచిదని చెబుతూ ఉన్నారు. బయటకు వెళ్లే సమయంలో హైడ్రోజన్ పెరాక్సయిడ్ సొల్యూషన్ ను తీసుకుని వెళ్లడం ద్వారా అద్దాలను శుభ్రం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ తో తయారు చేసిన శానిటైజర్లను వాడకూడదని.. వాటి ద్వారా లెన్స్ పాడయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అద్దాలు కంటి ద్వారా కరోనా వైరస్ రాకుండా అడ్డుకుంటున్నాయని గతంలో వైద్యులు తెలిపారు. ఎలాంటి అద్దాలు వాడుతున్నా సరే వాటిని జాగ్రత్తగా శానిటైజ్ చేయాలని వైద్యులు చెబుతూ ఉన్నారు. మాస్కులను కావాలంటే పక్కన పడేయడం కూడా జరుగుతూ ఉంటుంది.. కానీ అద్దాల విషయంలో అలా కాదు కాబట్టి.. కరోనాను తీసుకుని వచ్చే సాధనాలుగా అద్దాలు మారకుండా చూసుకోవాలని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అద్దాలను తరచుగా వేసుకుంటూ ఉంటాము కాబట్టి.. జాగ్రత్తగా అద్దాలను శానిటైజ్ చేయాలని చెబుతున్నారు. అద్దాల నుండి కరోనా వైరస్ కంటి లోకి చేరి.. అది శరీరం లోకి వెళ్లకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

అద్దాల మీద తొమ్మిది రోజుల పాటూ కరోనా వైరస్ బ్రతకగలదని రీసర్చ్ లలో తెలిసింది. మన చేతులను ఎలాగైతే పరిశుభ్రంగా కడుక్కుంటామో అలాగే ఐ గ్లాసులను కూడా కడగాలని వైద్యులు చెబుతున్నారు. అద్దాలను వేసుకున్న సమయంలో కూడా ఎక్కువ సార్లు చేతులతో తడమడం వంటివి చేయకూడదని అంటున్నారు. అద్దాలను పెట్టుకునే విధానంలోనూ, తీసేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Next Story