రేపటి నుంచే రామప్పలో.. వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్‌ క్యాంపు

World Heritage Volunteers Camp in Ramappa from tomorrow. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (కెహెచ్‌టి) సెప్టెంబర్ 19 నుండి 30 వరకు రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందిన రుద్రేశ్వర స్వామి ఆలయంలో

By అంజి  Published on  18 Sep 2022 7:03 AM GMT
రేపటి నుంచే రామప్పలో..  వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్‌ క్యాంపు

కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (కెహెచ్‌టి) సెప్టెంబర్ 19 నుండి 30 వరకు రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందిన రుద్రేశ్వర స్వామి ఆలయంలో 12 రోజుల "వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ (డబ్ల్యుహెచ్‌వి) క్యాంప్ -2022" నిర్వహించనుంది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు మాట్లాడుతూ.. ఆలయంలో స్వచ్ఛంద శిబిరాన్ని నిర్వహించడానికి యునెస్కో తమకు అనుమతినిచ్చిందని తెలిపారు. ఎనిమిది మంది విదేశీయులు సహా 50 మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వాలంటీర్లందరూ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, టూరిజం, హిస్టరీ, ఆర్కియాలజీలో అర్హత సాధించారని ఆయన అన్నారు. శిబిరంలో 28 మంది విషయ నిపుణులు రామప్ప దేవాలయానికి సంబంధించిన చరిత్ర, నిర్మాణ శైలిపై ఉపన్యాసాలు అందిస్తారు.

ఈ శిబిరంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు ఉపన్యాసాలు ఉంటాయని, ఆ తర్వాత తొమ్మిది రోజుల పాటు ఫీల్డ్ వర్క్ ఉంటుందని పాండురంగారావు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవమైన సెప్టెంబర్ 27న పాలంపేట్ గ్రామం నుండి రామప్ప ట్యాంక్ బండ్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నామని పాండురంగారావు తెలిపారు. శిబిరం సందర్భంగా ఆలయంలో పేరిణి శివతాండవం, కొమ్ము, బంజారా నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.

INTACH, తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ICOMOS, కపిల్ గ్రూప్‌ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే దంసరి అనసూయ అలియాస్ సీతక్క, సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ స్మిత ఎస్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య హాజరుకానున్నారు.

Next Story