రీల్స్ చేస్తూ.. ఉరి బిగుసుకుని యువకుడు మృతి
యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. లై
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 6:43 AM ISTరీల్స్ చేస్తూ.. ఉరి బిగుసుకుని యువకుడు మృతి
యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. లైకులు.. వైరల్ అవ్వడం కోసం పిచ్చి పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు ఫేమస్ అవ్వడం కోసం ప్రమాదాల్లో పడ్డవారు కూడా. కొందరు చనిపోతే.. ఇంకొందరు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ చేయబోయి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్ అనే 23 ఏళ్ల యువకుడు హోటల్‌లో పనిచేస్తూ ఉంటాడు. అతను తన సెల్‌ఫోన్లు నిత్యం రీల్స్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు. అయితే.. అక్కడ ఎవరూ లేని సమయం చూసి ఒక వెరైటీ రీల్ చేయాలని భావించాడు. దాంతో.. ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ను అమర్చి ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకునేలా రీల్స్ చిత్రీకరించసాగాడు. రీల్స్ తీస్తున్న క్రమంలోనే ఉరి వేసుకుంటున్నట్లు నటిస్తుండగా ఊహించని షాక్ ఎదురైంది. ఉరి బిగుసుకుని తాడుకి యువకుడు వేలాడపడ్డాడు. ఉరి నుంచి తప్పించుకునే వీలు లేకపోవడం అతన ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు అజయ్ మృతదేహాన్ని గుర్తించారు.
ఇక కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అజయ్ మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.