వైఎస్ షర్మిలపై మరో కేసు
వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఆమెపై కేసు
By అంజి Published on 18 May 2023 7:45 AM GMTవైఎస్ షర్మిలపై మరో కేసు
వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పత్రాలు రిలీజ్ చేశారని ఫిర్యాదు నమోదైంది. కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు షర్మిలపై సెక్షన్ 505 (2), 504 కింద కేసు నమోదు చేశారు.
టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో సీఎం కేసీఆర్ నోరు విప్పాలంటూ వైఎస్ షర్మిల ఇటీవల అఫిడవిట్ రిలీజ్ చేశారు. ఇకనైనా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇస్తూ అఫిడవిట్ మీద సీఎం సంతకం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. “మా ప్రభుత్వం రీషెడ్యూల్ చేసిన TSPSC పరీక్షలను ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో నిర్వహిస్తుంది. కట్టుదిట్టమైన భద్రత, భద్రతా ఏర్పాట్లు తీసుకుంటాం. ఈ పరీక్షల నిర్వహణలో ఇకపై ప్రశ్నపత్రాల లీక్‌లు, అవకతవకలు, డేటా చౌర్యం, అవినీతి లేదా అవకతవకలకు తావులేకుండా చూస్తాం’’ అని లేఖలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 1.91 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని మాట కూడా ఇచ్చినట్లు ఆ అఫిడవిట్ లో ఉంది. అది కాస్తా వైరల్ గా మారింది. దీనిపై సంతకం చేయాలని షర్మిల సీఎం కేసీఆర్ ను కోరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేసు నమోదు నమోదు చేశారు.