ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోయిన రేవంత్ రెడ్డి.. కొండా కుటుంబం ఏమంటోందంటే..!

Konda Movie Pre Release Event Issue. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

By Medi Samrat  Published on  19 Jun 2022 1:00 PM GMT
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోయిన రేవంత్ రెడ్డి.. కొండా కుటుంబం ఏమంటోందంటే..!

కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కొండా' సినిమాని తీసిన సంగతి తెలిసిందే. కొండా సినిమాని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన కొండా సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను శనివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా రేవంత్ రెడ్డి రావాల్సి ఉండగా.. పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన కొండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారు. దీంతో కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "కొండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రేవంత్ రెడ్డిని రానియ్యకుండా చేయడానికి, ఇది కొండా ఫ్యామిలీ యొక్క ప్రత్యర్థుల కుట్ర కాకపోతే ,ఈ అరెస్ట్ కి ఇంకేం కారణం?" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కొండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుస్మితాపటేల్‌ మాట్లాడుతూ.. "ఎర్రబెల్లి దయాకర్‌రావు నీ బతుకుమారదా? నీ బతుకంతా భయంతోనేనా? మొన్న విరాటపర్వంకి సాయి పల్లవికి రెడ్‌కార్పెట్‌ వేశావు, నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి వస్తుంటే భయపడి ఆపేశావు. ఇంకా ఎంతకాలం భయపడతావు? ఎన్నికలు రానియ్‌ నీ సంగతి చెబుతా.." అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story