పోలీస్‌ జాబ్‌ కోసం.. ఎత్తు పెంచేందుకు జుట్టుకు ఎం-సీల్‌.. చివరికిలా దొరికేసింది.!

A Young Woman Was Caught Trying To Get Taller In The Police Fitness Tests. తెలంగాణ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా రిక్రూట్‌మెంట్ కోసం.. ఫిజికల్ మెజర్‌మెంట్ పరీక్షలో

By అంజి  Published on  15 Dec 2022 10:19 AM GMT
పోలీస్‌ జాబ్‌ కోసం.. ఎత్తు పెంచేందుకు జుట్టుకు ఎం-సీల్‌.. చివరికిలా దొరికేసింది.!

తెలంగాణ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా రిక్రూట్‌మెంట్ కోసం.. ఫిజికల్ మెజర్‌మెంట్ పరీక్షలో ఒక మహిళ తన ఎత్తును పెంచడానికి తన జుట్టులో ఎమ్‌-సీల్ మైనపు ముక్కను అతికించి పట్టుబడింది. బుధవారం మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్న పోలీసు కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ శారీరక కొలత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు ఉద్యోగం పొందాలనే ఆశతో ఆ మహిళ తన జుట్టులో ఎం-సీల్ మైనపు ముక్కను అతికించింది. ఎత్తును కొలిచే పరికరంపై నిల్చున్నప్పుడు మోసం వెలుగులోకి వచ్చిందని ఓ అధికారి తెలిపారు.

ఎలక్ట్రానిక్ పరికరంలో ఆమె ఎత్తు, బరువు సరిగ్గా కనిపించలేదని అధికారులు గుర్తించారు. ఒక మహిళా సిబ్బంది ఆమెను తనిఖీ చేయగా.. అభ్యర్థి జుట్టు కింద ఎం-సీల్ మైనపును అతికించినట్లు గుర్తించి షాక్ అయ్యారు. తలపై, పాదాల కింద పర్ఫెక్ట్ టచ్ ఉన్నప్పుడే సెన్సార్లు స్పందించి ఎత్తు, బరువును సూచిస్తాయని అధికారులు వివరించారు. మహబూబ్‌నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్.వెంకటేశ్వర్లు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థిని అధికారులు తన దృష్టికి తీసుకురావడంతో అనర్హత వేటు వేశారు.

నిజమైన అభ్యర్థులు మాత్రమే ఎంపికయ్యేలా ఖచ్చితత్వం కోసం శారీరక దారుఢ్య పరీక్షలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీస్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఫిజికల్ మెజర్‌మెంట్, ఎండ్యూరెన్స్ పరీక్షలను నిర్వహిస్తోంది.

Next Story