అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..

By రాణి  Published on  2 April 2020 7:19 AM GMT
అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..

వనపర్తి జిల్లాలో ఓ తండ్రిని పోలీసులు కొడుతూ ఉంటే..అతని కొడుకు పోలీసులను '' అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..డాడీ..డాడీ '' అని ఆర్తనాదాలు పెడుతోన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో నిత్యావసరాలకు, ఎమర్జెన్సీ చికిత్సలకు తప్ప అనవసరంగా రోడ్లపై తిరగొద్దని చెప్తున్నారు. కానీ వీళ్లు ఏ అవసరమై బయటకు వచ్చారో తెలీదు గానీ..ఖాకీలు మాత్రం వారిపై జులుం ప్రదర్శించారు. ఏం చెప్తే అర్థం కావడం లేదా ? బయటికెందుకు వచ్చారంటూ ఆ వ్యక్తిని కింద పడేసి పిడిగుద్దులు గుద్దారు. పాపం ఆ పిల్లాడు ప్లీజ్ మా డాడీని కొట్టొద్దు..ఆపండి అంకుల్..డాడీ డాడీ అని గొంతు చించుకుని అరుస్తున్నా పట్టించుకోలేదు. పైగా ఆ పిల్లాడి తల్లిని కూడా పోలీసులు దూషించారు.

Also Read : ఏపీలో 132కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక్కరోజే..

అలా కళ్లముందే తండ్రిని కొడుతూ..తల్లిని నోటికొచ్చిన పదజాలంతో దూషిస్తుంటే పసిపిల్లాడి మనసు ఎంత తల్లడిల్లుతుందో..ఎంత ప్రభావం చూపుతుందోనన్న కనీసం ఆలోచించలేదు. గొంతు చించుకుంటూ..శోకాలు పెడుతున్నా పట్టించుకోలేదు. పిల్లాడు ఆక్రందనలు వినకుండా కళ్లముందే కన్నతండ్రికి హృదయవిదారకంగా చితకబాదారు. ఇలా ఇంగిత జ్ఞానం లేకుండా అమానుషంగా ప్రవర్తించిన ఖాకీరాయుళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

పనిలేకుండా బయటికొస్తే ఏదొక పనిష్మెంట్ ఇవ్వాలి..లేదా జరిమానా విధించాలి..అదీ కాకపోతే బైక్ సీజ్ చేయాలి..అంతేగానీ ఇష్టమొచ్చినట్లు కొట్టమని ఏ ప్రభుత్వం చెప్పలేదు. అయినా బయటికొస్తే కొట్టాల్సిన అవసరం ఏముందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఖాళీగా ఉన్నారా..? అయితే మీరూ నాలాగే ట్రై చేయండి..!

[video width="400" height="220" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-02-at-11.52.13-AM.mp4"][/video]

Next Story