నడక చెప్పే ఆయుష్షు గుట్టు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 1:42 PM IST
నడక చెప్పే ఆయుష్షు గుట్టు..!

మన నడక వేగం మన ఆయుష్షును సూచిస్తుందా? నాడీ, భౌతిక సమస్యలు కొన్నింటికి సూచిక కావచ్చని ఇప్పటి వరకూ ఒక అంచనా ఉండగా..తాజా అధ్యయనం ఒకటి నడక వేగానికీ, మన ఆయుష్షుకు సంబంధం ఉందని అంటోంది. 45 వయసులో ఎవరైనా నెమ్మదిగా నడుస్తున్నారంటే వాళ్లు వేగంగా వృద్దులవుతున్నట్లు లెక్క అని, వేగంగా నడిచే వారి అసలు వయసు తక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలని ఈ అధ్యయనం చెబుతోంది. 70, 80 ఏళ్ల వయసు వారిలో వేగంగా నడిచే వాళ్లతో పోలిస్తే మందగమనంతో ఉన్నవాళ్లు తొందరగా మరణిస్తారని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త టెర్రీ మోఫిట్ తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా వారు బడికెళ్లే దశ నుంచి మధ్య వయసు వరకు కొంతమందిపై పరిశోదరనలు నిర్వహించారు. నెమ్మదిగా నెమ్మదిగా నడిచే వారి శరీర వయసు వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోందని వివరించారు. వారి మెదడు నిర్మాణంలోనూ కొన్ని తేడాలు కన్పించాయని, మొత్తం మెదడు పరిమాణం, కొన్ని భాగాలు మందం తక్కువగా ఉన్నాయని టెర్రీ వివరించారు. అయితే అధ్యయనంలో పాల్గొన్న వారి చిన్నప్పటీ మెదడు చిత్రాలేవి లేకపోవడం గమనార్హం. మధ్య వయస్కుల ఆరోగ్య సమస్యలను పరిగణించే విషయంలో మాత్రం ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా.

Next Story