గెలుపే ల‌క్ష్యంగా భార‌త్‌.. సిరీసే ల‌క్ష్యంగా విండీస్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Dec 2019 7:55 AM GMT
గెలుపే ల‌క్ష్యంగా భార‌త్‌.. సిరీసే ల‌క్ష్యంగా విండీస్..!

విండీస్ జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో బాగంగా నేడు వైజాగ్ వేదిక‌గా రెండ‌వ వ‌న్డే జ‌రుగ‌నుంది. మొద‌టి వ‌న్డేలో అనూహ్య పరాజయం పొందిన టీమిండియా.. రెండో వ‌న్డేలో గెలుపే దిశ‌గా రంగంలోకి దిగుతుంది. విశాఖలోని వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్‌లో టీమిండియా త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సి ఉండ‌గా.. మొద‌టి వ‌న్డే నెగ్గిన‌ ఊపులో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని విండీస్ చూస్తోంది.

టీమిండియా టాఫార్డ‌ర్ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో ఉండ‌టం క‌లిసొచ్చే అంశం కాగా... చెన్నై మ్యాచ్‌లో విఫ‌లమ‌య్యారు. అయితే.. విశాఖలో అద్భుత రికార్డు ఉన్న కెప్టెన్‌ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్‌ శర్మలలో ఏ ఒక్కరు చెలరేగినా విండీస్ ఓట‌మి ఖాయం. మ‌రో ఓపెన‌ర్ రాహుల్ ఫామ్‌లో ఉండ‌గా.. శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్ కూడా రాణించడం టీమిండియాకు క‌లిపొచ్చే అంశం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఓవరాల్‌గా భారత జట్టు పటిష్టంగానే ఉంది. అందరూ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు కష్టం కాకపోవచ్చు.

ఇక‌ పొలార్డ్‌ నాయకత్వంలోని విండీస్‌ జట్టు తొలి మ్యాచ్ లో గెలిచిన జోరును విశాఖలో కూడా కొన‌సాగించాల‌ని భావిస్తోంది. వైజ‌గ్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనూకూలించ‌డం.. హెట్‌మైర్, షై హోప్ ఫామ్ లో ఉండ‌టం క‌లిపొచ్చే అంశం. ఇక మిడిల్ ఆర్డ‌ర్‌లో లూయిస్‌, పూరన్, పొలార్డ్‌లతో జట్టు బ్యాటింగ్‌ మరింత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో పేస్ బౌల‌ర్లు.. కాట్రెల్, జోసెఫ్, హోల్డర్‌.. స్పిన్నర్లు వాల్ష్, ఛేజ్ ల‌తో ప‌టిష్టంగా ఉంది.

భారత జ‌ట్టు: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, అయ్యర్‌, పంత్‌, జాదవ్‌, దూబే, జడేజా/చాహల్‌, దీపక్‌, కుల్దీప్‌, షమీ.

వెస్టిండీస్ జ‌ట్టు: పొలార్డ్‌ (కెప్టెన్‌), హోప్‌, లూయిస్‌/అంబ్రీస్‌, హెట్‌మైర్‌, పూరన్‌, చేజ్‌, హోల్డర్‌, పాల్‌, వాల్ష్‌ జూనియర్‌, అల్జారి, కాట్రెల్‌.

Next Story