విశాఖకు విమానయాన సంస్థలు గుడ్ బై.. కారణమెంటీ.?
By అంజి Published on 20 Feb 2020 9:41 AM IST
అమరావతి: విశాఖపట్నం విమానయాన రంగానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ ఎయిర్‌పోర్టుకు రెండు విమానయాన సంస్థలు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యాయి. చెన్నై - వైజాగ్ - చెన్నై, హైదరాబాద్ - వైజాగ్ - హైదరాబాద్ సర్వీసును రద్దు చేసే యోచనలో ఇండిగో విమాన సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి రెండో వారం నుంచి సర్వీసు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే దారిలో స్పైసె జెట్ సంస్థ కూడా ఉంది. ఢిల్లీ -వైజాగ్ సర్వీసును నిలిపివేసే యోచనలో స్పైస్ జెట్ విమాన సంస్థ ఉంది.
మార్చి నెలాఖరు నుంచి సర్వీసు రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇప్పటికే ఎయిర్ ఏషియాకు చెందిన కోల్‌కతా-వైజాగ్ విమానం కూడా రద్దు అయ్యింది. మార్చి 28 నుంచి వైజాగ్-బెంగళూరు, వైజాగ్-హైదరాబాద్ సర్వీసులకు ఎయిర్ ఏషియా ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించి ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాలేదు. లాభాలు సరిగా రాకనే తమ సర్వీసులను ఈ విమానాలు రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా విశాఖ నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే విమాన సర్వీసులు తగ్గడంతో విశాఖ ప్రజలకు కొత్త చిక్కొచ్చిపడినట్లైంది. డిమాండ్ ఉన్న మార్గాల్లో విమానాలను నడిపేందుకు ఆ విమాన సంస్థ యాజమానులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. విశాఖకు విమానయాన సంస్థలు గుడ్‌బై చెబుతున్నాయన్న ఆందోళనలో విమాన ప్రయాణికులు ఉన్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.