వివేకా హత్యకేసు : రిట్ లో ఏం అభ్యర్థన ఉంది ?

By రాణి  Published on  29 Jan 2020 10:05 AM GMT
వివేకా హత్యకేసు : రిట్ లో ఏం అభ్యర్థన ఉంది ?

ముఖ్యాంశాలు

  • వివేకా హత్య కేసు విచారణలో కనిపించని పురోగతి
  • సిబిఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించిన డా.సునీత
  • అనుమానితుల పేర్లను స్పష్టంగా ప్రస్తావించిన సునీత
  • హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన సునీత

“మార్చ్ 14 అర్థరాత్రి 2019న హత్యగావింపబడేనాటికి ఆయన వయసు 68 సంవత్సరాలు. నా తల్లి తన మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా హైదరాబాద్ లో మణికొండలో ఉన్న ల్యాంకో హిల్స్ లోని నా ఇంట్లోనే ఉండేది. నా తండ్రి వై.ఎస్.వివేకానందరెడ్డి పులివెందులలో ఉన్న మా సొంత ఇంట్లోనే ఒంటరిగా ఉండేవారు. తను తరచూ మమ్మల్ని చూడడానికి హైదరాబాద్ వచ్చేవారు. మేమూ తనని చూడడానికి తరచూ పులివెందులలోని మా ఇంటికి వెళ్లేవాళ్లం. మా ఇంటికి రంగయ్య అనే వాచ్ మన్ కాపలాగా ఉండేవాడు. మా కుటుంబంతోపాటుగా మా పెద్దనాన్న డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని సభ్యులు, పులివెందులలో ఉన్న మా బంధువులు, ఇతర పరిచయస్తులుకూడా రంగయ్యకు బాగా తెలుసు. పండింటి రాజశేఖర్ అనే వ్యక్తి మా ఇంట్లో ఉన్న ఔట్ హౌస్ లో ఉంటూ నా తండ్రి నిత్యావసరాలను చూసుకునేవాడు. వంటమనిషి లక్ష్మమ్మ రోజూ ఉదయం 6 గంటలకే మా ఇంటికి వచ్చేది.

వంటపనులు పూర్తయ్యేవరకూ ఆమె మా ఇంట్లో ఉండేది. కొడుకు ప్రకాష్ లక్ష్మమ్మను తన మోటార్ సైకిల్ పై రోజూ మా ఇంటి దగ్గర దింపి, ఆమె పని పూర్తికాగానే వచ్చి మళ్లీ తన బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు. స్థానిక కళాశాలలో లైబ్రేరియెన్ గా పనిచేసే ఎమ్.వి.కృష్ణారెడ్డి మా నాన్నకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసేవాడు. రోజూ ఉదయాన్నే 5.30 గంటలకు తను మా ఇంటికి వచ్చేవాడు. ప్రసాద్ మానాన్నకు రెగ్యులర్ డ్రైవర్ గా ఉండేవాడు.షేక్ ఇనయతుల్లా అనే వ్యక్తి మానాన్న దగ్గర 15 సంవత్సరాలుగా టైపిస్ట్ గా, క్లర్క్ గా, పి.ఎగా పనిచేస్తున్నాడు. రోజూ ఉదయాన్నే ఆయన మా ఇంటికి వచ్చి మా నాన్న చెప్పిన పనులు చేసి వెళ్తూ ఉండేవాడు.

ఇంతమంది పనివాళ్లు ఉండగా, ఆయన సొంతపనులు చూసుకునే ఆంతరంగికులు ఉండగా వాళ్లకు తెలియకుండా వివేకానంద రెడ్డి హత్య జరగడం అసంభవమని, కచ్చితంగా ఆంతరంగికులకు ఈ హత్య విషయం తెలిసే ఉంటుందని, ఎవరి భయపడి, దేనికి భయపడి,తెలిసినా వాళ్లంతా మిన్నకుంటున్నారో అర్థం కావట్లేదని, ఎవరిని ఈ కేసునుంచి తప్పించడానికి, కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదని వై.ఎస్.వివేకానందరెడ్డి కుమార్తే డాక్టర్ సునీతారెడ్డి హైకోర్టుకు తాను సమర్పించిన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు.

Next Story