బ్రేకింగ్: విశాఖ మృతులకు కోటి రూపాయల సాయం: సీఎం జగన్
By సుభాష్ Published on 7 May 2020 3:00 PM ISTవిశాఖలో గురువారం తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విష వాయులు లీక్ కావడంతో ఇప్పటి వరకూ 10 మంది ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ విశాఖలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అదే విధంగా మృతి చెందిన కుటుంబానికి కోటి రూపాయల చొప్పున చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు.
అలాగే బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎవ్వరూ అధైర్య పడొద్దు. చనిపోయిన వారిని నేను తిరిగి తీసుకుని రాలేను కానీ మనసున్న వాడిగా మాత్రం వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్ మీద ఉన్న వారికి 10లక్షలు , హాస్పిటల్ వార్డుల్లో ఉన్న వారికి లక్ష రూపాయలు ఆ ప్రాంతంలో ఇబ్బందికి గురి అయిన వారికి 25 వేలు అందజేస్తామని ప్రకటించారు.
అలాగే మృతి చెందిన మూగ జీవాల యజమానులకు కూడా ఆర్థిక సాయం అందజేస్తానని జగన్ ప్రకటించారు. ఒక్కో జంతువుకు రూ. 25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ఎల్జీ కంపెనీలో ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇలాగే కంపెనీ తరపున ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని, చికిత్స పొందుతున్నవారిని అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున అందుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపటి క్రితం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తూ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని జగన్ విచారం వ్యక్తం చేశారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
కాఆ, ఈ విష వాయువు ఐదు కిలోమీటర్ల మేరకు వ్యాపించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐదు గ్రామాల ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్నారులు సైతం ఎక్కడికక్కడే పడిపోయారు. విశాఖలో భయానకరమైన వాతావరణం నెలకొంది. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.